రాజారెడ్డి రాజకీయ ప్రవేశం – భవిష్యత్తు ఎక్కడ?

వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో చెరగని అక్షరాలతో నిలిచిపోయింది. ప్రజల మనసు గెలిచిన ఆ మహానేత వారసత్వాన్ని కొనసాగించే బాధ్యత ఆయన కుటుంబానికి వచ్చింది. కానీ వాస్తవానికి ఆ వారసత్వాన్ని సమర్థంగా మోసినది ఒక్క జగన్ మాత్రమే. ఆయనపై ప్రజలకు ఉన్న విశ్వాసం, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఆయన కష్టపడి నిర్మించిన మాస్ బేస్ – ఇవన్నీ జగన్‌ను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అగ్రగామిగా నిలిపాయి.
షర్మిల– రాజకీయ వైఫల్యం
వైఎస్ కూతురుగా షర్మిలకు మొదట ప్రత్యేక గుర్తింపు లభించింది. కానీ ఆ గుర్తింపును నిలబెట్టుకోవడంలో ఆమె పూర్తిగా విఫలమయ్యింది.
-
తెలంగాణలో చేసిన రాజకీయ ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదు.
-
అక్కడ ప్రజల మద్దతు రాకపోవడంతో షర్మిలకు “వెస్ట్ పొలిటిషియన్” అనే ముద్రే పడింది.
-
ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఆమెకు అసలు రాజకీయ స్థానం లేదు.
-
జగన్ ఇమేజ్‌లో చిన్న శాతం కూడా ఆమె వద్ద లేదు.
అందువల్ల షర్మిల వైఫల్యం ఇప్పటికే ప్రజల ముందు స్పష్టంగా నిలిచిపోయింది.
రాజారెడ్డి – మతప్రభోదకుడా, రాజకీయ నాయకుడా?
ఇప్పుడు ఆమె కుమారుడు రాజారెడ్డి రాజకీయ రంగంలోకి వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి ఆయన ఇప్పటివరకు మతప్రభోదకుడిగానే ఉన్నారు. చర్చిల్లో ప్రసంగాలు, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప ఆయనకు రాజకీయ అనుభవం లేదు.
రాజకీయాల్లో నిలవడానికి కావలసిన ఫేస్ వ్యాల్యూ, ప్రజల మధ్య అనుభవం, ఉద్యమాల్లో పాల్గొనడం, కేడర్ బేస్ – ఏదీ ఆయన వద్ద లేదు. షర్మిల బాటలో నడిస్తే ఫలితం ఖాయం – అట్టర్ ప్లాప్.
జగన్ ఎదుట పోటీ అసాధ్యం
ప్రజల మనసులో “వైఎస్ వారసుడు” అనే స్థానం జగన్‌దే. ఆయనే ఆ వారసత్వాన్ని జీవం పోశాడు. ఇప్పుడు రాజారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే, ప్రజలు మొదట ఆసక్తిగా చూడొచ్చు కానీ వెంటనే “జగన్ ఉన్నప్పుడు వీళ్ళ అవసరం ఏమిటి?” అని తిరస్కరిస్తారు.జగన్‌కు ఉన్న మాస్ బలం ఎదుట రాజారెడ్డి శూన్యమే అవుతాడు.
ఒక్క మార్గం – జగన్‌తో కలవడం
రాజారెడ్డి స్వతంత్రంగా రాజకీయాల్లో నిలబడే అవకాశమే లేదు. ఆయన భవిష్యత్తు ఒకటే మార్గంలో ఉంది – జగన్‌తో కలిసి నడవడం.
-
జగన్ పక్కన నిలిస్తే ఆయనకు కొద్దిగా గుర్తింపు వస్తుంది.
-
వైఎస్ కుటుంబం ఏకమైందనే భావనతో ప్రజలు సహానుభూతి చూపే అవకాశం ఉంటుంది.
-
లేకపోతే ఆయన రాజకీయ జీవితం పూర్తిగా “వేస్ట్” అవుతుంది.
-
వైఎస్ వారసత్వం జగన్ చేతుల్లో సజీవంగా ఉంది. షర్మిల తనకున్న అవకాశాన్ని వృథా చేసుకుంది. ఇప్పుడు కుమారుడు రంగంలోకి దిగినా ఫలితం పెద్దగా ఉండదు. ఆయనకు భవిష్యత్తు ఉండాలంటే ఒక్కటే మార్గం – జగన్‌తో కలవడం. లేకుంటే రాజారెడ్డి రాజకీయ ప్రవేశం కేవలం ఒక ప్రచార హడావిడిగానే మిగిలిపోతుంది.
What's Your Reaction?






