సీట్ల కోసం మహిళలు చిన్నపాటి యుద్ధాలే
ఏపీలో ఉచిత బస్సు పథకం ప్రారంభం కాగానే.. మహిళల కొట్లాటలు మొదలయ్యాయి. సీట్ల కోసం మహిళలు చిన్నపాటి యుద్ధాలే చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకం కారణంగా.. సీట్ల కోసం అతివలలు కొట్టుకోవడం వీడియోలు నెట్టింట వైరల్ కాగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రారంభం అయ్యాయి. ఉచిత ప్రయాణం ఏమో గానీ.. బస్సుల్లో సీట్ల కోసం తిప్పలు, తిట్లు, తన్నులు మాత్రం తప్పడం లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు పథకం.. ఇటీవలె ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. చంద్రబాబు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకంతో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా.. మహిళలకు రాష్ట్రం మొత్తం ఉచితంగా ప్రయాణించేందుకు కూటమి సర్కార్ అవకాశం కల్పించింది. దీంతో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే సీట్లు లేక మహిళలతోపాటు పురుషులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక అక్కడకక్కడా మహిళల మధ్య సీట్ల కోసం వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ బస్సులో సీటు కోసం మహిళలు కొట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జట్లు పట్టుకుని.. ఒకరిపై మరొకరు దాడి చేసుకోగా.. అదే బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కామెంట్ల వర్షం కురుస్తోంది.
What's Your Reaction?






