కొత్తపట్నం బీచ్‌లో కెరటానికి ఎమ్మెల్యే పరుగు
యు. కొత్తపల్లి మండలం, కొత్తపట్నం బీచ్‌లో గురువారం ఒక అరుదైన దృశ్యం కనబడింది. సాధారణంగా ప్రజలు సముద్రపు అలలతో ఆటలాడతారు. కానీ ఈ సారి మాత్రం మాజీ ఎమ్మెల్యేనే కెరటం తాకింది.
సముద్రపు అలల తాకిడికి దెబ్బతిన్న రహదారులు ఎలా ఉన్నాయో చూడటానికి వెళ్లిన ఆయనకు, సముద్రం కూడా ‘స్వాగతం’ చెప్పినట్లే... కోపంగా అన్నట్లు.. ఒక పెద్ద అల వచ్చి ఢీకొట్టింది. ఒక్కసారిగా అల తాకడంతో భయపడిపోయి పరుగులు పెట్టడం, ఆ దృశ్యం చూసిన వారిని నవ్వు ఆపుకోలేకపోయేలా చేసింది.
ప్రజలు అనేకసార్లు రోడ్లు ధ్వంసమయ్యాయంటూ వాపోయినా, పెద్దగా స్పందించని నేతల్ని సముద్రమే బోధిస్తున్నట్టుంది. ఈ సారి ప్రజల మాటలు పట్టించుకోకపోతే, వచ్చే సారి కెరటం మరింత బలంగా తాకుతుందేమో అన్నట్టుగా హెచ్చరించింది.
ఆ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ప్రజలు మాత్రం ఒకే మాట అంటున్నారు
“ప్రజల సమస్యలు వినకపోతే… ప్రకృతి ఇలా బుద్ది చెప్పాల్సిందే!”
What's Your Reaction?






