కాకినాడలో పాలస్తీనా జెండాలు… ముస్లిం మత పెద్దల క్షమాపణ

Sep 8, 2025 - 18:10
Sep 8, 2025 - 18:25
 0  10.8k

కాకినాడలో మహమ్మద్ ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారి పుట్టినరోజు ర్యాలీ శాంతియుతంగా ముగిసింది. అయితే ర్యాలీ సమయంలో కొంతమంది యువకులు పాలస్తీనా జెండాలను ఎగరేసిన ఘటన చోటుచేసుకుంది.

కాకినాడలో మిలాద్ ఉన్-నబీ ర్యాలీ సందర్భంగా నాలుగు కార్లపై పాలస్తీనా జాతీయ జెండాలను ప్రదర్శించిన ఘటన స్థానికంగా వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుని ఆ కార్లను సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు ముస్లిం యువకులు మిలాద్ ఉన్-నబీ ర్యాలీలో పాల్గొంటూ కార్లపై పాలస్తీనా జెండాలను ఎగురవేశారు. అయితే, దర్యాప్తులో ఆ కార్లలో కొన్ని అద్దె వాహనాలుగా ఉన్నట్లు తేలిందని పోలీసులు చెబుతున్నారు.ఈ ఘటనపై పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జెండాలను ఎందుకు ప్రదర్శించారు? ఎవరు తయారు చేశారు? బయట నుంచి ఎవరైనా వచ్చారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. కానీ, యువకులు మాత్రం తమకు వేరే ఉద్దేశం లేదని, పాలస్తీనా యుద్ధంలో అమాయకులు చనిపోతున్నందుకు సపోర్టుగా మాత్రమే జెండాలను ప్రదర్శించామని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, పాలస్తీనా జెండాలతో ప్రదర్శన చేసిన నాలుగు కార్లను సీజ్ చేశామని కాకినాడ సీఐ తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ కొనసాగిస్తున్నాం.. ఇప్పటికే కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నారు.కాకినాడలో శనివారం మిలాద్ ఉన్-నబీ ర్యాలీ సందర్భంగా పాలస్తీనా జాతీయ జెండాలతో కార్లలో వెళ్లిన ఘటనపై ముస్లిం మత పెద్దలు.. ఆ యువకులను వివరణ అడిగారు. తప్పు జరిగింది ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కానివ్వమని.. సదరు యువకులు క్షమాపణ చెప్పినట్టు తెలుస్తోంది. మెుత్తంగా కాకినాడలో పాలస్తీనా జెండాల ప్రదర్శనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నారు.

ఈ సంఘటనపై నిర్వాహకులు, ముస్లిం మత పెద్దలు వెంటనే స్పందించారు. సమాజం తరపున వారు హృదయపూర్వక క్షమాపణలు కోరుతూ, ఈ చర్య ఉద్దేశపూర్వకంగా జరగలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

 

What's Your Reaction?

Like Like 2
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0