12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు

Sep 12, 2025 - 10:16
Sep 12, 2025 - 10:16
 0  11k
  • ఐఎఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వం 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న తమీన్‌ అన్సారియాను గుంటూరు జిల్లాకు, అనంతపురం జిల్లా కలెక్టర్‌ వి వినోద్‌ కుమార్‌ను బాపట్ల జిల్లాకు,నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ఓ ఆనంద్‌ను అనంతపురం జిల్లాకు,పార్వతీపురం జిల్లా కలెక్టర్‌ ఎ శ్యామ్‌ ప్రసాద్‌ను శ్రీ సత్యసాయి జిల్లాకు కలెక్టర్లుగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇంటర్మీడియట్‌ విద్య డైరెక్టర్‌గా పనిచేస్తున్న కృతికా శుక్లాను పల్నాడు జిల్లాకు,ఎపిపిఎస్‌సి కార్యదర్శిగా ఉన్న పి రాజాబాబును ప్రకాశం జిల్లాకు, సమచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న హిమాన్షు శుక్లాను నెల్లూరు జిల్లాకు, సిసిఎల్‌ఎ జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తున్న ఎన్‌ ప్రభాకర్‌ రెడ్డిని పార్వతీపురం మన్యం జిల్లాకు, ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌గా ఉన్న నిషాంత్‌ కుమార్‌ను అన్నమయ్య జిల్లాకు, సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌గా ఉన్న ఎ .సిరిని కర్నూలు జిల్లాకు,రీహెబిలిటేషన్‌ అండ్‌ సెటిలిమెంట్‌ కమిషనర్‌ ఎస్‌ రామసుందర్‌ రెడ్డిని విజయనగరం జిల్లాకు, ట్రాన్స్‌కో జెఎండి కీర్తి చేకూరిని తూర్పు గోదావరి జిల్లాకు కలెక్టర్లుగా నియమించింది.
గుంటూరు, పల్నాడు, బాపట్ల, విజయనగరం, తూర్పు గోదావరి, సత్యసాయి, కర్నూలు, అన్నమయ్య పార్వతీపురం మన్యం జిల్లాల నుండి బదిలీలైన కలెక్టర్లకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఈ సందర్భంగా తన నివాసం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకమని అన్నారు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0