లంచం ఆపితేనే సమాజం సుస్థిరం

ఏ.సి.ఎఫ్.ఎచ్.ఆర్. రైట్ ఇంటలిజెన్స్ సంస్థ కోఆర్డినేటర్ డాక్టర్ రాయవరపు సత్యభామ
కాకినాడ, ఆగస్టు 19: ప్రజలలో అవినీతి వ్యతిరేక చైతన్యం పెంచేందుకు సామాజిక కార్యకర్తలు ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టాలని ఏ.సి.ఎఫ్.ఎచ్.ఆర్. రైట్ ఇంటలిజెన్స్ సంస్థ కోఆర్డినేటర్ రాయవరపు సత్యభామ పిలుపు నిచ్చారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “లంచం మన సమాజాన్ని లోపల నుంచి కుళ్లగొడుతోంది. లంచం తీసుకునే వారు మాత్రమే కాకుండా, లంచం ఇచ్చేవారు కూడా సమానంగా నేరస్తులే” అని సత్యభామ పేర్కొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉన్న ACB టోల్‌ఫ్రీ నంబర్ 14400 ను విస్తృతంగా వినియోగించుకోవాలని సత్యభామ సూచించారు. లంచం డిమాండ్ చేసిన అధికారులపై వెంటనే ఫిర్యాదు చేస్తే, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె వెల్లడించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆమె విజ్ఞప్తి చేసారు.
“లంచం లేని సమాజం నిర్మాణమే నిజమైన అభివృద్ధికి పునాది” అని రాయవరపు సత్యభామ పేర్కొ.న్నారు
What's Your Reaction?






