“జనసేనలో వర్గాధిక్యత: అసమాన నియామకాలపై ప్రజల ఆందోళన”

Sep 9, 2025 - 14:33
 0  11.9k
“జనసేనలో వర్గాధిక్యత: అసమాన నియామకాలపై ప్రజల ఆందోళన”

జనసేనలోని తాజా నియామకాలు, వర్గాధిక్యత, పార్టీ లోపాలను చూపిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి విశ్వసనీయంగా, కృషి చేసినవాళ్లకు పదవులు ఇవ్వకపోవడం, కనీసం పార్టీ సమావేశాలకు పిలవకపోవడం, పార్టీ సిధ్ధాంతాలను ప్రశ్నగా మార్చింది. కాపు వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, మిగతా వర్గాలను పక్కన పెట్టడం, సమగ్ర ప్రతినిధిత్వాన్ని నిర్లక్ష్యం చేయడం స్పష్టంగా కనిపిస్తుంది.

కాకినాడ స్థాయిలో MP, MLA స్థానాలు కాపు వర్గానికి చెందిన నేతలే పాలించడం , ముఖ్యమైన నాలుగు నామినేటెడ్ పోస్టులు తుమ్మల బాబుకే కేటాయించడం, సివిల్ సప్లై చైర్మన్ పదవి తోట సుదీర్ కు, దేవస్థానం చైర్మన్ స్థానాలు కూడా కాపు వర్గానికి చెందినవారికే కేటాయించడం, మిగతా వర్గాలకు పెద్దగా అవకాశాలు లేకుండా వర్గాధిక్యతను బలపరుస్తోంది. ఇకమిగతా నియామకాలు కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వారికే కేటాయించడం, వర్గ ప్రాధాన్యత కేవలం ఒకే వర్గానికి మాత్రమే ఇచ్చే విధంగా మారిందని చూపిస్తుంది.

ఇప్పుడు రాబోయే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అదే తతంగం కొనసాగుతుందా అనే ప్రశ్న ప్రజలలో ఉత్పన్నమైంది. అణిగి, మణిగి ఉన్న కేడర్ లేని నాయకులకు టిక్కెట్లు ఇస్తారా? లేదా ఇతర రాష్ట్రాల నుంచి డబ్బులు, వనరులు కలిగిన వ్యక్తులను ఇక్కడ పోటీ చేయించిస్తారా? ఈ సందేహం ప్రజల్లో నెలకొంది. కాపు వర్గానికి మాత్రమే అధిక ప్రాధాన్యత, బీ.సీ., ఎస్.సీ. మహిళలను పక్కన పెట్టడం, నియామకాలను కేంద్రీకృతం చేయడం, వర్గాల మధ్య అసమాన భావన, అసహనాన్ని బలపరిచింది

ప్రజల దృష్టిలో పవన్ సిధ్ధాం తాలపై ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి.. ఇదే పవన్ సిధ్ధాంతమా? ఇదే నిజమైన జనసేన సిధ్ధాంతమా?” అనే ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. వర్గాధిక్యత, నియామకాల అసమానత, పార్టీ లోపాలను ఈ నియామకాలు బట్టి బలంగా  చూపిస్తున్నాయి.

ఒకే వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన, మిగతా వర్గాలు తమ స్థానాన్ని కోల్పోతున్నట్లు భావిస్తాయి. ఇది పార్టీ విస్తృత ప్రజా మద్దతును తగ్గిస్తుంది, సామాజిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. సమగ్ర ప్రతినిధిత్వం లేకపోవడం వలన, పార్టీ స్థిరత్వం, ప్రజా నమ్మకం, భవిష్యత్తు వ్యూహాలపై దీర్ఘకాల ప్రతికూల ప్రభావం స్పష్టమవుతుంది.

సారాంశంగా, కాపు వర్గానికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇవ్వడం, పార్టీ ఆవిర్భావం నుంచి విశ్వసనీయ సభ్యులను పక్కన పెట్టడం, నియామకాలను కేంద్రీకృతం చేయడం, వర్గాల మధ్య అసమాన భావనను, అసహనాన్ని బలపరిచింది. ఈ పరిస్థితిని చూస్తూ ప్రజలు ప్రశ్నిస్తున్నారురాబోయే ఎన్నికల్లో నిజమైన పార్టీ విధానం, నిజమైన ప్రతినిధిత్వం ఉంటుందా? లేదా వర్గాధిక్యత, సొంత వర్గం ప్రయోజనాలకే జనసేన  కొనసాగుతుందా? అన్నది ప్రశ్నే

 

 

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0