సక్కు అనాథాశ్రమం లో పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుక

kakinada :జనసేన పార్టీ అధినాయకుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురష్కరించుకుని కాకినాడ జిల్లాలో జనసేన మహిళా ఉపాధ్యక్షురాలు బొలిశెట్టి వెంకటలక్ష్మి, సీనియర్ జనసేన నాయకుడు పిడుగు గోవిందరాజు ,చవ్వకుల గణేశ్,లు తమ కార్యకర్తలతో కలిసి పలు సేవా కార్యక్రమలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కాకినాడలో సేవా కార్యక్రమాలు
పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లాలో పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు బొలిశెట్టి వెంకటలక్ష్మి, సీనియర్ జనసేన నాయకుడు పిడుగు గోవిందరాజు ,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని అనేక కేంద్రాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, పేదలకు పండ్లు, బిస్కట్లు పంపిణీ చేశారు.
సక్కు అనాథాశ్రమం లో ప్రత్యేక కార్యక్రమాలు
కాకినాడలోని సక్కు అనాథాశ్రమంలో పార్టీ మహిళా వైస్ ప్రెసిడెంట్ బొలిశెట్టి వెంకట లక్ష్మి మరియు సీనియర్ నాయకుడు పిడుగు గోవింద రాజుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అనాధ ఆశ్రమంలోని వృద్ధులకు ఆహారాన్ని అందజేశారు.
పట్టణం లో ఇతర సేవా కార్యక్రమాలు
కాకినాడ నివాస ప్రాంతాల్లో చవ్వకుల గణేశ్, అడబాల చక్రరావు, కట్టా శ్రీను, రమేష్ నేతృత్వంలో జనసేన కార్యకర్తలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. జనసేన కార్యకర్తలు ప్రజలకు పండ్లు, బిస్కట్లు పంచడం, అన్నదానం వంటి కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజును సేవా దృక్పథంతో జరిపారు.
పట్టణ వ్యాప్తంగా ఉత్సాహం
పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కాకినాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కూడా అభిమానులు భారీగా కలుసుకొని సామాజిక కార్యక్రమాలతో ఉప ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం.
What's Your Reaction?






