“కాకినాడ జనసేనలో కలకలం… సిటీ అధ్యక్షుడు తోట సుదీర్‌పై సైనికుల ఆగ్రహం!”

-
“సొంత వర్గానికే పదవులు – కష్టపడే కార్యకర్తలకు నిర్లక్ష్యం” ఆరోపణలు..!
-
వైసిపి నుంచి వచ్చిన వారికి వరస వరసగా పదవులు..!
-
మంగళగిరిలోనే పవన్ కళ్యాణ్ దగ్గర వీర మహిళల ఫిర్యాదు..!
-
సోషల్ మీడియాలో అసమ్మతి బహిరంగం..
కాకినాడ జనసేనలో పరిస్థితులు వేడెక్కుతున్నాయి.
సిటీ అధ్యక్షుడు తోట సుదీర్ వ్యవహారశైలిపై సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.👉 “సుదీర్ తన సొంత వర్గానికే పదవులు కట్టబెడుతున్నాడు. కష్టపడి పనిచేసిన జనసైనికులు మాత్రం పక్కన పడుతున్నారు” అని మండిపడుతున్నారు.
👉 వైసిపి నుంచి వచ్చిన వారికి వరుసగా పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి ఉవ్వెత్తున ఎగసిపడుతోంది.జనసైనికుల ఘాటు విమర్శలు—
“ప్రజల కోసం… సమానత్వం కోసం జనసేన అని పవన్ కళ్యాణ్ అన్నాడు. కానీ తోట సుదీర్ మాత్రం కుల రాజకీయాలు ఆడుతున్నాడు. నిజంగా పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన సైనికులను అవమానిస్తున్నాడు” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే జనసేన వీర మహిళలు మంగళగిరిలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
సోషల్ మీడియాలోనూ ఈ అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తమవుతోంది.
పార్టీలో అసమ్మతి మంటలు రగులుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.కాకినాడ జనసేనలో తోట సుదీర్ తీరుపై సైనికుల ఆగ్రహం తారాస్థాయికి చేరింది.
కష్టపడిన సైనికులకు న్యాయం జరుగుతుందా? లేక కులపక్షపాతం కొనసాగుతుందా?
ఈ ప్రశ్నకే ఇప్పుడు సమాధానం కావాలి.
What's Your Reaction?






