కాకినాడ జిల్లా బిసి సంఘం జనరల్ సెక్రటరీగా కట్టా శ్రీనుబాబు నియామకం

కాకినాడ : జాతీయ బిసి ప్రజా సంక్షేమ సంఘం తరఫున కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీగా కట్టా శ్రీనుబాబు గారిని నియమించారు. ఈ నియామకాన్ని జాతీయ అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు గారు అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా గూడూరి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ –
కట్టా శ్రీనుబాబు గారు బిసి వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ వస్తున్నారని,ఆయన కృషి వల్ల సంఘం మరింత బలోపేతం అవుతుందని,ప్రత్యేకంగా విద్యా రంగంలో జరుగుతున్న అక్రమ ఫీజుల వసూళ్లపై పోరాటానికి శ్రీనుబాబు గారు ముందుండాలని పిలుపునిచ్చారు.
కట్టా శ్రీనుబాబు గారు ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలలో భాగస్వామిగా ఉంటూ సామాజిక సేవలో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మనవత్వ దృక్పథంతో బిసి వర్గాల సమస్యలపై ఎల్లప్పుడూ స్పందిస్తారని, సాధారణ ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడతారని సంఘం నాయకత్వం విశ్వాసం వ్యక్తం చేసింది.
బిసి ఐక్యత కోసం కట్టా శ్రీనుబాబు గారు తీసుకునే ప్రతి అడుగు, భవిష్యత్తులో బిసి ఉద్యమాన్ని మరింత బలపరుస్తుందన్న నమ్మకం ఉంది.
కాకినాడ జిల్లాలో బిసి సంఘం కార్యకలాపాలు కట్టా శ్రీనుబాబు నాయకత్వంలో మరింత వేగం సంతరించుకోవడం ఖాయమని జాతీయ బిసి ప్రజా సంక్షేమ సంఘం భావిస్తోంది.
“కాకినాడ జిల్లా బిసి ప్రజల్లో కట్టా శ్రీనుబాబు నియామకం హర్షం రేపింది”
What's Your Reaction?






