బల్క్ డ్రగ్ నిలుపుదల చేయాలని .. రోడ్డెక్కిన మత్స్యకారులు
నక్కపల్లి (అనకాపల్లి) : మండలంలోని మత్స్యకార గ్రామమైన రాజయ్యపేట మత్స్యకారులు రోడ్డెక్కారు. నక్కపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి … బల్క్ డ్రగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకఅష్ణ, ఉమాదేవి లను తాము తలపెట్టిన ఆందోళన శిబిరానికి రానీయకుండా పోలీసులు ఆంక్షలు విధించి, గఅహనిర్బంధాలు చేసి అడ్డుకున్నారని, వారందరిని తీసుకురావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సెక్షన్ 30 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు మాట్లాడుతూ … బల్క్ డ్రగ్ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులు 29 రోజుల నుండి శాంతియుతంగా రిలే దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మత్స్యకారులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం దిగివచ్చి బల్క్ డ్రగ్ ను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనికి ముందు రాజయ్యపేట నుండి మత్స్యకారులంతా నక్కపల్లి జాతీయ రహదారిని దిగ్బంధించేందుకుగాను ర్యాలీగా బయలుదేరి వస్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించాలని ప్రయత్నం చేసినప్పటికీ, మత్స్యకారులు ఆ అడ్డంకులను అధిగమించి నక్కపల్లికి తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. దీంతో కనుచూపుమేర జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0