పిఠాపురంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

పసుపు–కుంకుమ, చీరల పంపిణీ కార్యక్రమం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో
🔸 పవన్ సొంత డబ్బులతో సేవా కార్యక్రమం
-
దాదాపు 10 వేల మహిళలకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ
-
జనసేన సైనికుల ద్వారా ఇంటింటికీ అందజేత
-
రాజకీయాల్లోనూ, సినీ రంగంలోనూ బిజీ అయినా… ప్రజా సేవలో ముందుండే పవన్
🔸 అసంతృప్తి స్వరం
-
“100 రూపాయల లోపు చీరలు పంచారు, కొందరికి మాత్రం ఖరీదైన చీరలు ఇచ్చారు” అని మహిళల విమర్శ
-
“50 వేల మంది మహిళలు ఉన్న నియోజకవర్గంలో కేవలం 10 వేల మందికే ఎందుకు?” అని ప్రశ్న
-
“ఇలా చేయడం న్యాయమా పవన్?” అంటూ మహిళల నిలదీత
పిఠాపురం:
శ్రావణమాసం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో శుక్రవారం ఉదయం నుంచే సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఆచారం ప్రకారం ఎప్పటిలానే ఈసారి కూడా ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళలకు చీరలు అందజేశారు.
తన స్వంత ఖర్చులతోనే నియోజకవర్గంలోని దాదాపు 10 వేల మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలను పంపిణీ చేయాలని పవన్ ముందడుగు వేశారు. ఈ కార్యక్రమాన్ని ఆయన జనసేన సైనికుల ద్వారా నిర్వహిస్తున్నారు.
ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉండి, మరోవైపు సినీ రంగంలో కూడా నటిస్తూ, ప్రజల కోసం ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారని స్థానికులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలులోకి వచ్చాయని, భవిష్యత్తులో మరింత ప్రజలకు తోడ్పడతారని వారు చెప్పారు.
అయితే, మరోవైపు కొందరు మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చీరల నాణ్యతపై విమర్శలు చేస్తూ, "100 రూపాయల లోపు చీరలు పంచారు, కానీ కొన్ని వర్గాలకు మాత్రం ఎక్కువ ఖరీదైన చీరలు అందించారు" అని ఆరోపించారు. అదేవిధంగా, నియోజకవర్గంలో దాదాపు 50 వేల మంది మహిళలు ఉండగా, కేవలం 10 వేల మందికే పంపిణీ జరగడం ఏమిటని ప్రశ్నించారు. “పవన్ గారూ, ఇది న్యాయమా?” అని స్థానిక మహిళలు నిలదీస్తున్నారు.
What's Your Reaction?






