కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న EWS (Economically Weaker Sections) రిజర్వేషన్ ను వెంటనే రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న EWS (Economically Weaker Sections) రిజర్వేషన్ ను వెంటనే రద్దు చేయాలని జాతీయ బి.సి. ప్రజా సంక్షేమ సంఘం ఫౌండర్ మరియు అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వర రావు డిమాండ్ చేశారు.
కాకినాడ జిల్లా, చిడిగ గ్రామంలోని జయ చంద్ర నివాస్ లో జరిగిన పాత్రికేయ సమావేశంలో జాతీయ బి.సి. ప్రజా సంక్షేమ సంఘం ఫౌండర్ మరియు అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వర రావు అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న EWS (Economically Weaker Sections) రిజర్వేషన్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం అమలు చేస్తున్న రిజర్వేషన్ వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఈ నిర్ణయం మారిందని, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల హక్కులకు భంగం కలిగిస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం రిజర్వేషన్లు ఏర్పాటయ్యాయని, కానీ ఆ ఆత్మను కేంద్రం విస్మరించిందని గూడూరి వెంకటేశ్వర రావు గారు స్పష్టం చేశారు. EWS రిజర్వేషన్‌ను వెంటనే నిర్మూలించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు.బి.సి. మహిళలు సమాజంలోని అన్ని రంగాలలో వెనుకబడరని, ఉద్యమాలలో ముందుకు రావలసిన అవసరం ఉన్నదని భావించి, కాకినాడ పట్టణానికి చెందిన శ్రీమతి వాసంశెట్టి దుర్గ మంగా తాయారు గారిని జాతీయ బి.సి. ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేయబడినవి.ఈ నియామకం 23-08-2025 నుండి అమల్లోకి వస్తూ రెండు సంవత్సరాలపాటు కొనసాగును.ఆమె తన బాధ్యతలను సంఘ నిబంధనల ప్రకారం నిర్వర్తించి, బి.సి. మహిళల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు . గూడూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లు గత 40 ఏళ్లుగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టబడినప్పటికీ, బి.సి. మహిళలకు ప్రత్యేక కోటా లేకపోవడం వల్ల అది ఆమోదం పొందలేకపోయింది. ఆ సమయంలో ఉత్తర ప్రదేశ్ నుంచి ములాయంసింగ్ యాదవ్ గారు, బీహార్ నుంచి శరద్ యాదవ్ గారు ఈ బిల్లును వ్యతిరేకించి నిలిపివేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరు మహానేతలు ఇప్పుడు స్వర్గస్తులయ్యారు. ప్రస్తుతం ఆ నేతలు లేకపోవడంతో, బిల్లును అడ్డుకునే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో ఈ బిల్లు అగ్రవర్ణ మహిళలకు మేలు జరిగే విధంగా ఆమోదం పొందింది. కానీ, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఈ బిల్లును బి.సి. మహిళల హక్కులను దెబ్బతీయడమేనని భావించి వ్యతిరేకిస్తున్నారు. జనగణనలో సమగ్ర కుల గణన చేయాలని దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాలు ఆందోళన చేస్తున్నారు. మరలా కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలుపుతూ 2027లో చేస్తానని చెప్పడాన్ని గూడూరి వెంకటేశ్వరరావు తప్పుపట్టారు. 2018లో అనాటి కేంద్ర హోంశాఖ రాజనాథ్ సింగ్ సమగ్ర కుల గణన చేస్తానని చెప్పి చేయలేకపోయారని ఆయన గుర్తు చేశారు. 2027లో సమగ్ర కుల గణన చేస్తారన్న మాటలు ప్రజలు నమ్మడం లేదని ఆయన హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను – బి.సి.లకు రక్షణ చట్టం తీసుకురావడం, స్థానిక సంస్థల రిజర్వేషన్లను 50 శాతం పెంచడం, 50 సంవత్సరములకే ఎస్సీ బీసీలకు వృద్ధాప్య పింఛను మంజూరు చేయడం – ఇప్పటివరకు చేయలేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.వెంటనే అమలు చేయాలని గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గూడూరి వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో పిల్లి సత్తిబాబు ,పిల్లి నాగ ప్రసాద్, కోటా శ్రీనివాసరావు, నీలం శ్రీనివాస్, పాలెపు దేవి, మాదబత్తుల పద్మ,నాటి లక్ష్మి ,గుత్తుల లోవకుమారి , విత్తనాల సత్యవతి ,వనుము లక్ష్మి, జే .విజయ లక్ష్మి , బి .మఖ్య వేణి ,ఏ.గాయత్రి ,పి.పద్మ, కే .లోవకుమారి ,పి.ప్రభావతి, ఎం.దుర్గ, తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






