స్పెషల్ ట్రైన్లో మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు..
ఉత్తరప్రదేశ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఘజియాబాద్ (Ghaziabad) జిల్లాలోని సాహిబాబాద్‌లో ఓ స్పెషల్ ట్రైన్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపు చేశారు.వివరాల్లోకి వెళితే.. పూర్ణియా స్పెషల్ రైలు (Purnia Special Train) ఢిల్లీ నుంచి బీహార్ (Bihar)కు వెళ్తోంది. రైలు ఘజియాబాద్ జిల్లా సాహిబాబాద్ వద్దకు రాగానే లగేజ్ కోచ్ (luggage coach) లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన అధికారులు రైలును ఘజియాబాద్‌లో ఆపేసి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రైల్లో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0