క్యాన్సర్‌ను నయం చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి.. ఉచితంగా ఇచ్చేందుకు రంగం సిద్ధం

రష్యా వైద్య రంగంలో ఒక సంచలనం సృష్టించింది. 'ఎంటెరోమిక్స్' పేరుతో క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇది ప్రయోగశాల పరీక్షల్లో వంద శాతం ప్రభావవంతంగా పని చేసింది. ముఖ్యంగా గామాలెయా సెంటర్ అభివృద్ధి చేసిన ఈ mRNA ఆధారిత వ్యాక్సిన్‌ను.. రోగి కణితి కణాల జన్యువుల ఆధారంగా ప్రత్యేకంగా తయారు చేశారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న ఈ వ్యాక్సిన్.. విజయవంతమైతే క్యాన్సర్ చికిత్సలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది.
గతం ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మాస్కోలోని ప్రముఖ గామాలెయా సెంటర్‌యే.. ఈ 'ఎంటెరోమిక్స్' వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేసింది. ఇది ఒక రకమైన mRNA ఆధారిత చికిత్సా పద్ధతి. ఈ వ్యాక్సిన్‌ను ఒక్కో రోగికి వారి కణితి కణాల జన్యువుల ఆధారంగా ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇది ఒక విప్లవాత్మకమైన ప్రక్రియ కాగా.. దీని ద్వారా వ్యాక్సిన్ నేరుగా చేస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లోకి ప్రవేశించింది. ఈ ట్రయల్స్ విజయవంతం అయితే ఇది క్యాన్సర్ చికిత్సా రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రాథమిక పరీక్షల్లో దీని ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో రష్యా ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను తమ పౌరులకు ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ప్రస్తుత అమెరికాకు చెందిన మోడెర్నా, బయోఎన్‌టెక్ వంటి ప్రముఖ ఫార్మా కంపెనీలు కూడా ఎంఆర్ఎన్ఎ ఆధారిత క్యాన్సర్ థెరపీలను అభివృద్ధి చేస్తున్నాయి. అయితే రష్యా 'ఎంటెరోమిక్స్' వ్యాక్సిన్‌తో ఈ పోటీలో ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం ఒక వైద్య ఆవిష్కరణ మాత్రమే కాదని.. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపగల సామర్థ్యం దీనికి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న లక్షలాది మందికి ఈ వ్యాక్సిన్ ఒక కొత్త ఆశను ఇస్తోంది. ఈ క్లినికల్ ట్రయల్స్ విజయం సాధించి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. ఇది క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయగలదని లేదా కనీసం దానిని దీర్ఘకాలిక వ్యాధిగా మార్చగలదని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
What's Your Reaction?






