ఆవులను వధించి నూనెల తయారీ....భారీగా గోమాంసం విక్రయాలు...
గోమాంసం నుంచి నూనె, నెయ్యి తయారీ
కాకినాడ జిల్లా తుని పట్టణంలోని రామకృష్ణ కాలనీ శివారులో ఆవులను వధించి, గోమాంసం ద్వారా నూనె మరియు నెయ్యి తయారీ జరుగుతుండటం స్థానికులను షాక్‌కి గురిచేసింది.
సమాచారం అందుకున్న తుని టౌన్ సీఐ గీతా కృష్ణ ఆధ్వర్యంలో, ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పోలీసులు దాడి నిర్వహించారు
దాడిలో అధికారులు 8 టిన్నుల నూనె, 40 పశు చర్మాలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, మూడు ఆవులను రక్షించి గోశాలకు తరలించారు.
పోలీసు వర్గాల ప్రకారం, ఈ ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసి, గోమాంసాన్ని సొంత నూనె / నెయ్యి తయారీలో ఉపయోగించడం ఇలాంటి అక్రమ చర్యలపై దర్యాప్తు కొనసాగుతోంది.
అధికారుల హెచ్చరిక: “చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపశమనం ఉండదు. ప్రజలూ ఇటువంటి అక్రమ కార్యకలాపాల విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వాలి” అని తెలిపారు.
What's Your Reaction?






