తొలగించిన ఓటర్ల జాబితాను వెల్లడించిన ఇసి

న్యూఢిల్లీ : బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఎన్నికల సంఘం దాదాపు 65 లక్షల మంది ఓటర్లను తొలగించింది. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సుప్రీంకోర్టులో దీనిపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా తొలగించిన ఓటర్ల జాబితాను ఆగస్టు 19 లోగా బయటపెట్టాలని, ఆగస్టు 22వ తేదీలోగా ఎస్ఐఆర్పై నివేదికను కోర్టు ముందు సమర్పించాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించిన 65 లక్షల ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ తొలగించిన జాబితాలో ఎఎస్డి (ఆబ్సెంట్, షిఫ్ట్, డెడ్) ఓటర్ల జాబితాను విడుదల చేసింది. బీహార్లోని రోహ్తాస్, బెగుసరారు, అర్వాల్, ఇతర పోలింగ్ బూతుల్లో తొలగించిన ఓటర్ల జాబితాను ప్రదర్శనకు ఉంచినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సిఇఓ) తెలిపారు
What's Your Reaction?






