కోవ్వూరు వారాహి అమ్మవారి ఆలయంలో నిధుల దుర్వినియోగం

1.
జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసినా బొలిశెట్టి వెంకట లక్ష్మి
కాకినాడ, ఆగస్టు 17:
కాకినాడ జిల్లా, కోవ్వూరు లోని శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగం భక్తులను బెదిరించే ఘటనలు జరుగుతున్నాయని,భక్తులు ఇచ్చే విరాళాలను సాంప్రదాయ హుండీ పెట్టకుండా, కొంతమంది నిర్వాహకులు QR/UPI స్కానర్లు, బ్యాంక్ అకౌంట్ల ద్వారా నిధులు సేకరించి భారీగా దుర్వినియోగం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ కి బొలిశెట్టి వెంకట లక్ష్మి ఫిర్యాదు చేసినారు. ఈ పరిస్థితులు భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని,అలాగే, ఆలయ ఆవరణలో బౌన్సర్లు / కిరాయి వ్యక్తులను పెట్టి భక్తులను బెదిరించడం, ఒత్తిడి చేయడం జరుగుతోందని సమాచారం. కొంతమంది వ్యక్తులు కుల–మత విద్వేషాలు రేగగొట్టే విధంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేయడం వలన పరిస్థితి మారే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారన్నారు.ఆలయ నిర్వాహకురాలు ప్రతి సారి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పేరు చెబుతూ … అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనపై స్థానిక భక్తురాలు బొలిశెట్టి వెంకట లక్ష్మి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. ఆమె తన ఫిర్యాదులో –
- గత 3 సంవత్సరాల ఆలయ ఆదాయం-ఖర్చులపై పూర్తి విచారణ జరపాలని,
- ఆలయ నిధుల దుర్వినియోగం నిలువరించాలని,
- భక్తుల భద్రత కోసం బౌన్సర్లను తొలగించాలని,
- విరాళాల సేకరణ పారదర్శకంగా జరగాలని,
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,
డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై భక్తులు అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
What's Your Reaction?






