పల్నాడులో ఏం జరుగుతోంది.. హత్యకు గురవుతున్న ఒంటరి మహిళలు..

Sep 3, 2025 - 14:10
 0  15.1k
పల్నాడులో ఏం జరుగుతోంది.. హత్యకు గురవుతున్న ఒంటరి మహిళలు..

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన ముస్యం పోలేమ్మకు యాభై ఏళ్లు ఉంటాయి. ఆమె పెదగార్లపాడు నుండి వచ్చేసి కరాలపాడులో ఉంటుంది. అప్పుడప్పుడు గుంటూరులోని కుమార్తె ఇంటికి వెలుతుంటుంది. అయితే, గత నెల ముప్పైఒకటో తేదిన పోలేమ్మ పెదగార్లపాడు వచ్చింది.

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన ముస్యం పోలేమ్మకు యాభై ఏళ్లు ఉంటాయి. ఆమె పెదగార్లపాడు నుండి వచ్చేసి కరాలపాడులో ఉంటుంది. అప్పుడప్పుడు గుంటూరులోని కుమార్తె ఇంటికి వెలుతుంటుంది. అయితే, గత నెల ముప్పైఒకటో తేదిన పోలేమ్మ పెదగార్లపాడు వచ్చింది. ఆమెకు వచ్చే వితంతు పెన్షన్ తీసుకోవడానికి ప్రతి నెల గ్రామానికి వస్తుంటుంది. అదే విధంగా ఈ నెల కూడా వచ్చి ఒకటో తేదిన పెన్షన్ కూడా తీసుకుంది. ఆ తర్వాత తన కూతురు వద్దకు వెల్తున్నట్లు స్థానికులకు చెప్పింది. ఆమె బంధువులు, కొడుకు అదే గ్రామంలో నివసిస్తున్నారు. అయితే రెండో తేదిన ఉదయం ఆమె తలుపు తీయక పోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.. దీంతో స్థానికులు ఇంటికి వెళ్లి చూడగా పోలెమ్మ రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే స్థానికులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

పోలేమ్మ బంధువులను పోలీసులు విచారించిన ఎటువంటి సమాచారం లభ్యం కాలేదు. ఎవరూ హత్య చేసి ఉంటారో అన్న అంశంపై పోలీసులు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఈ మధ్య కాలంలో పల్నాడు జిల్లాలో ఒంటరి మహిళలు హత్యకు గురకావడం కలకలం రేపుతోంది. వినుకొండలో ఇద్దరూ మహిళలు హత్యకు గురయ్యారు. ఇప్పుడు పెదగార్లపాడులో ఒంటరిగా ఉన్న మహిళనే టార్గెట్ చేసి హత్య చేశారు. దీంతో కొంతమేర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పోలీసులు ఆమె కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఒకటో తేదిన ఎవరెవరూ కాల్ చేశారో సమాచారం సేకరించారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

నిందితులు ఇంటిలోకి ఎలా వెళ్లారన్న కోణంలోనూ పరిశీలించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని అయితే సిసి కెమెరాలు పెద్దగా లేకపోవడంతో ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు చెబుతున్నారు. ఎస్పీ నేరుగా రంగంలోకి దిగడంతో కింద స్తాయి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంటిలో డబ్బులు పోయిన దాఖలాలు లేకపోవడంతో హత్యకు ఇరత కారణాలు ఏమై ఉంటాయా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0