మాజీ డిప్యూటీ సిఎం నారాయణస్వామి ఇంట్లో సిట్ సోదాలు

తిరుపతి సిటీ : మద్యం కేసులో మాజీ డిప్యూటీ సిఎం నారాయణస్వామి ఇంట్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) తనిఖీలు చేపట్టింది. పుత్తూరులోని ఆయన నివాసంలో సోదాలు చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడితోనే మద్యం పాలసీపై సంతకాలు చేశారని అధికారులు అనుమానిస్తున్నారు. నూతన మద్యం పాలసీ సమయంలో నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. వైకాపా హయాంలో మద్యం పాలసీలో మార్పులపై సిట్ నారాయణ స్వామిని ప్రశ్నించనుంది. లిక్కర్ ఆర్డర్స్‌లో ఆన్‌లైన్ విధానం తొలగించి మాన్యువల్ విధానం తేవడంపైనా సిట్ విచారణ జరపనున్నది.
What's Your Reaction?






