తాళ్లరేవు మండలం వద్ద ONGC గ్యాస్ పైప్‌లైన్ లీక్ – పెను ప్రమాదం తప్పింది

కాకినాడ జిల్లా : తాళ్లరేవు మండలం ధరియాల తిప్పశుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ONGC గ్యాస్ పైప్‌లైన్‌లో లీక్ సంభవించి భారీ మంటలు ఎగసిపడటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు విపరీతంగా వ్యాపించే అవకాశం ఉన్నప్పటికీ, అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి సుమారు గంటన్నరలోనే అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. జిల్లా కలెక్టర్‌తో సహా సంబంధిత అధికారులను ఫోన్‌లో సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. మంటలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చాయని అధికారులు సీఎంకు తెలిపారు.
ముఖ్యమంత్రి కలెక్టరుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
-
పైప్‌లైన్‌ను పూర్తిగా పరిశీలించి లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలి.
-
సమీప గ్రామాల ప్రజలలో భయాందోళనలు తొలగించేందుకు భద్రతా చర్యలు చేపట్టాలి.
-
ప్రతి క్షణం తాజా సమాచారాన్ని అందించాలి.
ఈ ఘటనపై స్థానికులు కూడా స్పందించారు. అధికారులు వేగంగా స్పందించడం, సీఎం తక్షణ ఆదేశాలు ఇవ్వడం వల్లే పెను ప్రమాదం తప్పిందని వారు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ONGC మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.
ONGC అధికారులు కూడా పైప్‌లైన్ భద్రతపై పూర్తి స్థాయి పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు.
What's Your Reaction?






