ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ లంచం కేసులో అరెస్ట్

Aug 22, 2025 - 10:58
 0  10.7k
ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ లంచం కేసులో అరెస్ట్

కాకినాడ, ఆగస్టు 22: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరుగుతుందనే విమర్శలు వస్తున్న తరుణంలో ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ ఎం.సత్యనారాయణ, డేటా ఎంట్రీ ఆపరేటర్ జి.అరుణాచలం గురువారం ACB ఉచ్చులో చిక్కారు. కాంట్రాక్టర్‌ నుంచి రూ.23,000 లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి జైలుముఖం చూశారు.

జొండారపు రాజబాబు అనే కాంట్రాక్టర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం పూర్తి చేసి రూ.7.34 లక్షల బిల్లు, రోడ్డు పనులకుగాను రూ.1.05 లక్షల EMD రాబట్టుకోవాల్సి ఉంది. కానీ ఆ బిల్లులు CFMS పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలంటే “కమిషన్ లేకుండా కుదరదు” అంటూ కమిషనర్ సత్యనారాయణ లంచం డిమాండ్ చేశాడని ACB అధికారులు ధృవీకరించారు.

వెంటనే కాంట్రాక్టర్ రాజబాబు రాజమండ్రి ACBకి ఫిర్యాదు చేయగా, గురువారం లక్కవరం కాలనీలో బిళ్లలు లెక్కపెడుతుండగానే అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినారు. ఇద్దరినీ అరెస్టు చేసి, రాజమండ్రి ACB ప్రత్యేక కోర్టుకు తరలించారు.

👉 రాష్ట్ర కార్యాలయాల్లో లంచగొండ్లను చూసినవారు మౌనం వహించకూడదని ACB విజ్ఞప్తి చేసింది.

  • టోల్ ఫ్రీ నంబర్: 1064

  • మొబైల్: 94404 40057

  • ఇమెయిల్: complaints-acb@ap.gov.in

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0