వనస్థలిపురం సబ్జిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

హైదరాబాద్: వనస్థలిపురం సబ్జిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం, వనస్థలిపురం పరిధిలోని తుర్కయాంజలకు చెందిన ఓ వ్యక్తి 200 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి సబ్ రిజిస్ట్రార్ రాజేశ్‌ను సంప్రదించాడు. రిజిస్ట్రేషన్ కోసం రాజేశ్ లక్ష రూపాయలు డిమాండ్ చేయగా, చివరికి రూ.70 వేలకే ఒప్పందం కుదిరింది.
దీనిపై స్థల యజమాని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో, శుక్రవారం సబ్జిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ రమేష్‌కు రూ.70 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
విచారణలో రమేష్, సబ్జిస్ట్రార్ సూచన మేరకే డబ్బులు తీసుకున్నట్లు అంగీకరించాడు. అనంతరం ఏసీబీ అధికారులు సబ్జిస్ట్రార్ రాజేశ్‌తో పాటు డాక్యుమెంట్ రైటర్ రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
What's Your Reaction?






