వికలాంగుల పెన్షన్‌లపై కత్తెర

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్వరమే జోక్యం చేసుకోవాలి..
బలహీన ,అట్టడగు వర్గాలకు వెన్నుపోటు
కాకినాడ జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులపై పెన్షన్ కత్తెర ఊపేస్తున్నారు. "40 శాతం కంటే తక్కువ డిజబిలిటీ" అంటూ వేలాది మంది లబ్ధిదారులకు అనర్హత నోటీసులు జారీ చేస్తున్నారు. చిన్నతనం నుంచే రెండు కళ్లూ కనబడని గొల్లప్రోలు మాడాబత్తుల బాబూరావు, మాటలు రాని పిఠాపురం వై.నాగమణి లాంటి వారు – నిజంగా పనిచేయలేని స్థితిలో ఉన్నా, పెన్షన్‌నే బతుకుదెరువుగా పెట్టుకున్నా… అదే పెన్షన్‌ను కూడా ఇప్పుడు దూరం చేస్తున్నారు.
జిల్లాలో ఇప్పటికే 4,222 మందికి నోటీసులు వెళ్లాయి. రూ.15 వేల పెన్షన్ తీసుకుంటున్న మంచానికే పరిమితులలో 57 మందిని “డిజబిలిటీ తక్కువగా ఉంది” అంటూ రూ.6 వేలకు తగ్గించారు. 60 ఏళ్లు పైబడిన 348 మందిని వృద్ధాప్య పెన్షన్‌కు మార్చేశారు. ఇది బలహీన వర్గాల వెన్నుపోటు కాదా?
పెన్షన్లు పెంచామని, పేదల భరోసా కాపాడతామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం – ఇప్పుడు అదే పెన్షన్లను ఏరివేస్తూ అర్హులను రోడ్డున పడేస్తోంది. ఈ అన్యాయం ముందు నిశ్శబ్దంగా నిల్చోకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి వికలాంగుల సమస్యలపై జోక్యం చేసుకోవాలి.
ఇది అన్యాయం కాదు మరి ఏమిటి?
పెన్షన్లు పెంచామని గొప్పలు చెప్పుకుంటూ – అదే పెన్షన్లను ఇప్పుడు ఏరివేస్తే, బలహీన వర్గాల భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది?
పవన్ కళ్యాణ్ గారూ,
ప్రజలు మిమ్మల్ని *“పేదల వాణి, అణగారిన వారి భరోసా”*గా నమ్మారు. ఇప్పుడు వికలాంగుల పెన్షన్‌ల సమస్యపై మీరు వెంటనే స్పందించి జోక్యం చేసుకోవాలి. నిజమైన అర్హులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలి.
What's Your Reaction?






