ప్రాచీన వస్తువుల పేరుతో మోసం – ఐదుగురు నిందితుల అరెస్టు

జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వెల్లడి
కాకినాడ : ప్రాచీన, విలువైన, అరుదైన పురాతన వస్తువులు, నాణేలు తమ వద్ద ఉన్నాయని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను కాకినాడ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గురువారం కాకినాడ గాంధీనగర్ పార్కు వద్ద వీరిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
అరెస్టైనవారు కాకినాడకు చెందిన షేక్ సర్దార్ @ గుణ, విశాఖకు చెందిన దువ్వు రాజశేఖర్, పశ్చిమ గోదావరి నరసాపురానికి చెందిన జమ్ము లక్ష్మీదుర్గ, తూర్పుగోదావరి అనపర్తి మండలం రామవరం గ్రామానికి చెందిన కండవల్లి శ్రీను, కాకినాడ రామారావు పేటకు చెందిన పడాల వెంకటరమణ. వీరి వద్ద నుంచి ఆరు నకిలీ ప్రాచీన నాణేలు, ఒక నకిలీ ప్రాచీన ప్లేటు, నాలుగు నకిలీ ధృవపత్రాలు, రెండు నకిలీ రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా “అమృత ట్రస్ట్” పేరుతో అనాధాశ్రమం నడుపుతున్నట్లు నమ్మించి, ప్రజలకు ఆన్లైన్ ఖాతాలు తెరవిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిందని ఎస్పీ వివరించారు. ట్రస్టు నుండి కోట్ల రూపాయలు వస్తాయని, వాటిని ఖాతాల్లో జమ చేస్తామని నమ్మించి మరింత డబ్బు లాగేవారని తెలిపారు. నకిలీ నాణేలపై ప్రత్యేక పూత వేసి టెస్టులు చేయించి నిజమైనవిగా చూపించి మోసం చేసేవారని తెలిపారు
What's Your Reaction?






