కాకినాడలో ఆపద్బాంధవుడు మచ్చా గంగాధర్ – దుర్గాడి వీర మణికంఠ కుటుంబానికి అండగా..
కాకినాడ నగరంలోని డైరీ ఫారం సెంటర్ 11వ డివిజన్‌లో ఇటీవల హఠాత్ మరణం చెందిన దుర్గాడి వీర మణికంఠ గారి కుటుంబాన్ని, నగర యువ సామాజిక సేవకుడు మచ్చా గంగాధర్ (MGR) ఆదివారం (24-08-2025) పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి రెండు నెలల పాటు సరిపడే నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే వారి కుమారుడి విద్య కొనసాగేందుకు స్కూల్ యూనిఫాం ను స్వయంగా అందించారు.
మానవతా దృష్టితో ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు, అభాగ్యులకు అండగా నిలిచే మచ్చా గంగాధర్ గురించి స్థానికులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. అవసర సమయంలో తోడ్పడే ఆయనను ప్రజలు "ఆపద్బాంధవుడు" అని కొనియాడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జాతీయ బిసి ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి వాసం శెట్టి దుర్గ మంగ తాయారు ,ఎలుసూరి వర ప్రసాద్ , దారపు శిరీష ,ఉప్పడ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
What's Your Reaction?






